close

తాజా వార్తలు

Published : 15/08/2020 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తాం : మోదీ

దిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. 

‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి ఆమోదం తెలపగానే, భారత్‌లో తయారు చేసే కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తుంది. ప్రతి భారతీయుడికీ టీకా అందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేం సిద్ధం చేశాం’ అని ప్రధాని వెల్లడించారు. అలాగే కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తోన్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల సేవలను ఆయన ప్రశంసించారు. 

కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192 చేరింది. మరోవైపు మరణాల సంఖ్య 50 వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.