
తాజా వార్తలు
ఆ దర్యాప్తును రాజకీయం చేయొద్దు : WHO
వైరస్ మూలాన్ని తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం
ఇంటర్నెట్‌డెస్క్ : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ సమాచారం ఎంతో అవసరమని ఉద్ఘాటించింది.
కొవిడ్-19 మూలల కోసం జరుగుతున్న పరిశోధనను రాజకీయం చేయొద్దని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కోరారు. ఇలాంటి చర్యలు నిజాన్ని వెలికితీయడంలో ఉపయోగపడవని పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్‌వో వుహాన్ నుంచి ప్రారంభిస్తుందని.. లభించిన ఆధారాలనుబట్టి ఇతర మార్గాలు ఉంటే అన్వేషిస్తుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.
డబ్ల్యూహెచ్‌వో స్థానం గురించి మాట్లాడుతూ ‘డబ్ల్యూహెచ్‌వో స్థానం చాలా స్పష్టంగా ఉంది.ఈ వైరస్ మూలాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఇది మాకు సహాయపడుతుంది’ అని అధనామ్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెల నుంచి నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో గతవారం తొలిసారిగా తగ్గుదల కనిపించిందని.. ఐరోపాలో వైరస్ బాధితుల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 6.3 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 14.73 లక్షలకు చేరింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
