close

తాజా వార్తలు

Published : 06/07/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

'కోటి' దాటిన‌ కొవిడ్ ప‌రీక్ష‌లు!

సోమ‌వారం ఉద‌యానికి కోటి నాలుగు వేల శాంపిళ్ల ప‌రీక్ష‌
వెల్ల‌డించిన భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి

దిల్లీ: భార‌త్‌లో కరోనా వైర‌స్ మ‌హమ్మారి విజృంభిస్తోన్న త‌రుణంలో కొవిడ్ ప‌రీక్ష‌లను పెంచ‌డం అనివార్య‌మ‌య్యింది. దీనిలో భాగంగా భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) దేశంలో నిత్యం దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల శాంపిళ్ల‌ను సేకరించి కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం ఉద‌యం 11గంట‌ల వ‌ర‌కు దేశంలో 1,00,04,101 శాంపిళ్ల‌కు కొవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు పూర్తిచేసిన‌ట్లు ఐసీఎంఆర్ ప్ర‌క‌టించింది. ఆదివారం నాడు 1,80,596 న‌మూనాలను ప‌రీక్షించిన‌ట్లు తెలిపింది. భార‌త్‌లో కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కోసం 1100 ల్యాబ్‌ల‌కు ఐసీఎంఆర్ అనుమ‌తినిచ్చింది. వీటిలో 786ప్ర‌భుత్వ ల్యాబ్‌లు ఉండ‌గా మ‌రో 314 ప్రైవేటు లేబొరేట‌రీలు ఉన్నాయి.

కొవిడ్‌-19 వైర‌స్ నిర్ధార‌ణ కోసం భార‌త్లో ఆర్‌టీ-పీసీఆర్, ట్రూనాట్‌, సీబీనాట్ విధానాన్ని అనుస‌రిస్తున్నారు. దీనికోసం స్వాబ్ ద్వారా(ముక్కు, గొంతు నుంచి) న‌మూనాల‌ను సేక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న మొత్తం ల్యాబ్‌ల‌లో 591 ల్యాబ్‌ల‌లో ఆర్‌టీ-పీసీఆర్, 417 ట్రూనాట్‌, 92కేంద్రాల్లో సీబీనాట్ ద్వారా కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. వీటిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 61, తెలంగాణ‌లో 36 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

అమెరికాలో 4కోట్ల ప‌రీక్ష‌లుట్రంప్
క‌రోనా ధాటికి అత‌లాకుత‌లం అవుతున్న అమెరికా, కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను భారీగా నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు కోట్ల మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలో ఏ దేశంలో కూడా అమెరికా చేసినట్లుగా ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌న్నారు. ఎక్కువ సంఖ్య‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్ల‌యితే అమెరికా కంటే భార‌త్‌, చైనాల్లోనే క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఇక ర‌ష్యా కూడా దాదాపు 2 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా బ్రిట‌న్ ఇప్ప‌టికే కోటి ప‌రీక్ష‌లు పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించింది. 

చైనాలో 9కోట్లు..?
క‌రోనావైర‌స్‌కు పుట్టిల్లైన చైనాలో ఇప్ప‌టివ‌ర‌కు 9కోట్ల మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపినట్లు చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ ఈమ‌ధ్యే వెల్ల‌డించింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించుకుంటున్న స‌మ‌యంలో చైనా ఈ సంఖ్య‌ను వెల్ల‌డించ‌డం గ‌మనార్హం. వీటిలో ఎక్కువ‌గా వుహాన్‌, బీజింగ్‌లలోనే ఉన్నాయి. అయితే క‌రోనా వైర‌స్ కేసుల‌‌పై, ప‌రీక్ష‌ల‌పై చైనా చెబుతున్న లెక్క‌లు ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని అంత‌ర్జాతీయ‌ నిపుణులే అనుమానిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి..
భార‌త్‌లో క‌రోనా..ర‌ష్యాను దాటి మూడో స్థానంలోకి!
చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని