తమిళనాట 3వేలు దాటిన కరోనా మరణాలు

తాజా వార్తలు

Published : 22/07/2020 21:26 IST

తమిళనాట 3వేలు దాటిన కరోనా మరణాలు

రికార్డు స్థాయిలో కేసులు నమోదు 

చెన్నై: తమిళనాడును కరోనా వణికిస్తోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి.  తాజాగా బుధవారం ఏకంగా 5849 పాజిటివ్‌ కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,492కి పెరిగింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,31,583 మంది కోలుకోగా.. మరణాల సంఖ్య  3144గా నమోదైంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 51,765 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 

రికవరీ రేటు 70.12%

గడిచిన24 గంటల్లో 60,112 శాంపిల్స్‌‌ పరీక్షించగా.. 5849 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే 1171 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 4910మంది రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,15,147 శాంపిల్స్‌ను పరీక్షించారు. తమిళనాట రికవరీ రేటు 70.12శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని