బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా
close

తాజా వార్తలు

Published : 11/03/2020 10:19 IST

బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,292 మంది మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సామాన్యులతో పాటు వీఐపీలు, దేశాల మంత్రులనూ వదలట్లేదు. ఇప్పటికే ఇరాన్‌లో ఎంపీలకు, మంత్రులను సోకిన వైరస్ తాజాగా బ్రిటన్‌ ఆరోగ్యశాఖ ఉపమంత్రి నాడీన్‌ డోరిస్‌కు సంక్రమించింది. ఈ విషయం ఆమే స్వయంగా ప్రకటించారు. తనకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నాని వెల్లడించారు. గత శుక్రవారం కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించిన ఓ ఫైల్‌పై సంతకం చేస్తున్న సమయంలో ఆమె తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె పలువురు ఉన్నతాధికారులు, నాయకులను కలిసినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందర్నీ గుర్తించే పనిలో పడ్డారు. ఆమె కలిసిన వారిలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో వైరస్‌ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. మరో 373 మందికి ఈ మహమ్మారి సోకింది. 

* ఇరాన్‌లో వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తుండడంతో దేశంలో ఉన్న తమ ఖైదీలను విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. అమెరికా పౌరులకు ఏదైనా జరిగితే దానికి ఇరాన్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. పరిస్థితులు చేజారుతుండడంతో తమ దేశానికి చెందిన 70,000 మంది ఖైదీలను ఇప్పటికే ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ముందే చేయాల్సిన చర్య అని ఐరాస హక్కుల సంఘం అభిప్రాయపడింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 291 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,042 మంది వైరస్‌ బాధితులుగా మారారు.

* టర్కీలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటీవల ఆ బాధితుడు యూరప్‌లో పర్యటించినట్లు గుర్తించారు. దీంతో విదేశీ పర్యటనల్ని మానుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

* క్రితం రోజుతో పోలిస్తే చైనాలో మంగళవారం కొత్తగా వైరస్ సోకిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న 24 మందిలో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే మరో 22 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 3,158కి చేరింది. వ్యాధికి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన 16 ఆస్పత్రుల్ని మూసివేశారు. 

* పూర్తి నిర్బంధంలో ఉన్న ఇటలీలో కొత్త సమస్య మొదలైంది. జైళ్లలో ఉన్న ఖైదీల మద్య వైరస్ వ్యాప్తి చిచ్చుపెట్టింది. దీంతో మంగళవారం బందీల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఘటనల్లో 12 మంది మృతిచెందారు.  ఇటలీలో ఇప్పటి వరకు వైరస్‌ వల్ల 631 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10,149 బాధితులుగా మారారు. వైరస్‌ వ్యాప్తికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దాదాపు ఆరు కోట్ల మందిని ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

* అమెరికాలో వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. ఒక్క వాషింగ్టన్‌లోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో 900 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. రోజురోజుకీ పెరుగుతున్న బాధితుల సంఖ్య అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న జో బిడెన్‌, బెర్నీ శాండర్స్ తమ ఎన్నికల ర్యాలీల్ని వాయిదా వేసుకున్నారు. అలాగే కాలిఫోర్నియా తీరంలో ఉంచిన నౌక నుంచి ప్రయాణికుల్ని బయటకు తెచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.  

* నాలుగురోజులుగా దక్షిణకొరియాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తి మంగళవారం కాస్త పెరిగింది. నిన్న ఒక్కరోజే 242 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 7,755కు చేరింది. మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణించిన వారి సంఖ్య 60ను తాకింది.  

* భారత్‌లో ఇప్పటివరకు దాదాపు 60 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కేరళలో 8 మందిలో వైరస్‌ నిర్ధారణ జరిగిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 14కు పెరిగిందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొత్తగా 3 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. ట్రావెల్‌ హిస్టరీని దాచినట్లు తెలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదచేస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. 

దేశం  బాధితులు  మృతులు

చైనా

దక్షిణ కొరియా

ఇరాన్‌ 

ఇటలీ

అమెరికా

జపాన్‌

ఫ్రాన్స్‌

స్పెయిన్‌

హాంకాంగ్‌

యునైటెడ్‌ కింగ్‌డం

భారత్‌

80,778

7,775

8,042

10,149

900

568

1,606

1,622

120

373

60

3,158

60

291

631

29

12

30

36

03

06

00

ప్రపంచవ్యాప్తంగా 1,17,747 4,292

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని