దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు: సుచరిత

తాజా వార్తలు

Published : 05/08/2020 21:24 IST

దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు: సుచరిత

అమరావతి: ప్రజల పట్ల అత్యుత్సాహం, అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. నేరాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. పలాస ఘటనలో దురుసుగా ప్రవర్తించిన కాశీబుగ్గ సీఐపై వేటు వేసినట్లు తెలిపారు. తప్పు చేస్తే పోలీసులు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘దళిత వ్యక్తి పట్ల దురుసుగా వ్యవహరించారని తెలిసిన వెంటనే కాశీబుగ్గ సీఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆయన్ను సస్పెండ్ చేశాం. అలానే దిశ పోలీస్టేషన్ల ఏర్పాటుతో మహిళపై జరిగే నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. నేరాలను సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’’ అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని