భారత్‌తో సరిహద్దులను మూసేసిన బంగ్లాదేశ్‌ 

తాజా వార్తలు

Published : 26/04/2021 11:15 IST

భారత్‌తో సరిహద్దులను మూసేసిన బంగ్లాదేశ్‌ 

ఢాకా: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ పొరుగు దేశం బంగ్లాదేశ్‌.. భారత్‌పై ఆంక్షలు విధించింది. రెండు వారాలపాటు భారత్‌తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ ఒమెన్‌ ప్రకటించారు. సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహన ప్రయాణాలను కొవిడ్‌ కారణంగా నిషేధిస్తున్నట్లు ఒమెన్‌ వెల్లడించారు. అయితే నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు బంగ్లాదేశ్‌ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలను ఏప్రిల్‌ 14 నుంచే అధికారులు రద్దు చేశారు.

భారత్‌ను కరోనా వణికిస్తోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజు 3 లక్షలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం ఒక్కరోజే 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2,812 మంది మృతిచెందారు. మహమ్మారి సోకి మొత్తంగా 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని