Canada: భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగించిన కెనడా

తాజా వార్తలు

Published : 10/08/2021 22:55 IST

Canada: భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగించిన కెనడా

ఒట్టావా: భారత్‌లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భారత్‌ విమానాలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాజ్ఞలు ఆగస్టు 21తో ముగియనున్నాయి.

అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌ ఆందోళనకరంగానే ఉండటంతో విమానాలపై నిషేధాన్ని సెప్టెంబర్ 21 వరకూ పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.  ప్రజారోగ్య విభాగం సలహా మేరకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్ ఉద్ధృతితో ఏప్రిల్ 22న తొలిసారిగా భారత్  నుంచి వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. ఇప్పటి వరకూ నిషేధాన్ని ఐదుసార్లు పొడిగించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని