G-7: మోదీజీ..అక్కడ చెప్పేవి ఇక్కడ చేయండి
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 14:18 IST

G-7: మోదీజీ..అక్కడ చెప్పేవి ఇక్కడ చేయండి

దిల్లీ: జి-7 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి బోధించే విషయాలను భారత్‌లో పాటించాలని సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

బ్రిటన్‌లోని కార్బిస్‌ బేలో ఆదివారం జరిగిన జి-7 సమావేశంలో భాగంగా ‘స్వేచ్ఛాయుత సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు’ పేరిట జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రజాస్వామ్యానికి, భావ స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు. ఆధిపత్యం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం, ఆర్థిక దౌర్జన్యాలతో ఎదురయ్యే ముప్పుల నుంచి భాగస్వామ్య విలువలను పరిరక్షించడంలో జి-7 కూటమికి, మిత్ర దేశాలకు భారత్ అండదండలు అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. దీనిపై చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జి-7 సమావేశాల్లో ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం స్ఫూర్తిమంతంగానూ, అలాగే వ్యంగ్యంగాను ఉంది. ప్రపంచానికి బోధించే విషయాలను మోదీ ప్రభుత్వం భారత్‌లో పాటించాలి. ఆ సమావేశాల్లో పాల్గొన్న అతిథుల్లో మోదీ ఒక్కరే వర్చువల్‌గా హాజరుకావడం విచారకరం. ఎందుకో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి? కరోనాపై పోరాటంలో భారత గణాంకాలు కలవరపెడుతున్నాయి. భారత్‌లో రికార్డు స్థాయిలో రోజూవారీ కేసులు వెలుగుచూశాయి. జనాభాపరంగా చూసుకుంటే టీకా పంపిణీలో వెనకబడి ఉన్నాం’ అని విమర్శించారు.

భారత్‌లో కరోనా రెండోదశ ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విరుచుకుపడున్నాయి. కాగా, ఈ మహమ్మారి కారణంగా ప్రధాని జి-7 సమావేశానికి ఆన్‌లైన్ వేదికగా హాజరుకావాల్సి వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని