Pfizer: బాలలపై సమర్థంగా పనిచేస్తోన్న ఫైజర్‌: ఎఫ్​డీఏ

తాజా వార్తలు

Published : 23/10/2021 18:44 IST

Pfizer: బాలలపై సమర్థంగా పనిచేస్తోన్న ఫైజర్‌: ఎఫ్​డీఏ

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో విరివిగా వినియోగిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఫైజర్‌పై అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్​డీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలపై ఫైజర్​ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫైజర్​ అందించిన డేటాను పరిశీలించిన అనంతరం ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. పిల్లల్లో వ్యాధి సోకకుండా ఫైజర్​ టీకా సమర్థంగా పనిచేస్తోందని ట్రయల్స్‌లో తేలింది. 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలకు టీకా పంపిణీ చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో ఎఫ్​డీఏ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే అంశం.

అమెరికాలో 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 28మిలియన్ల మంది ఉన్నారు. వారికి ఇచ్చేందుకు టీకాలు సిద్ధమేనా? అన్న అంశంపై వచ్చే వారంలో ఎఫ్​డీఏ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. ఈ తరుణంలో ఫైజర్ ఇచ్చిన​ డేటాను విశ్లేషించి, ఆ వివరాలను ఎఫ్​డీఏ విడుదల చేసింది. చిన్నారులకు టీకా ద్వారా కలిగే దుష్ప్రభావాలకన్నా.. మంచే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్​డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్​ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.

5-11 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎఫ్​డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులతో కూడిన ప్యానెల్​ ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఎఫ్​డీఏ తుది నిర్ణయానికొస్తుంది. ఒకవేళ ఎఫ్​డీఏ అనుమతులిస్తే.. అమెరికాలో నవంబర్​ తొలివారం నుంచి చిన్నారులకు టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 12 అంతకుమించిన వయస్సు వారికి ఇప్పటికే ఫైజర్​ వ్యాక్సిన్​ ఇస్తున్నారు. రెండు డోసుల టీకాతో పిల్లలకు 91శాతం సామర్థ్యం లభిస్తుందని, వారిలో లక్షణాలున్నా.. వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఫైజర్​ ఓ డేటాను విడుదల చేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని