ఇసుక సంచులు, తాళ్లు.. ఉరితీతకు ట్రయల్స్‌

తాజా వార్తలు

Updated : 13/01/2020 15:31 IST

ఇసుక సంచులు, తాళ్లు.. ఉరితీతకు ట్రయల్స్‌

చివరిసారిగా కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి

దిల్లీ: నిర్భయ అత్యాచార దోషుల మరణశిక్ష అమలుకు తిహార్‌ జైలులో ఉరికంబం సిద్ధమైంది. ఉరిశిక్ష అమలుకు ఆదివారం తిహార్‌ జైలు అధికారులు ఇసుక సంచులతో ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకుగాను దోషుల బరువుకు సమానమైన ఇసుక సంచులను వినియోగించారు. దిల్లీలోని తిహార్‌ జైలు ఉరికంబంపై ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసే వీలుంది. కాగా ప్రస్తుతం నిర్భయ నేరస్థులు నలుగురిని ఒకేసారి ఉరి తీసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ 16, 2012న జరిగిన నిర్భయ ఘటనలో దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ కుమార్‌, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలకు జనవరి 22న ఉరితీయాలని దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే వారిలో ఇద్దరు వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జనవరి 14న తీర్పు వెలువరించనుంది. ఆ తీర్పు ఆధారంగా ప్రస్తుతం జైలు నంబర్‌ 2,4లో ఉంచిన నేరస్థులను ఉరిశిక్ష అమలుకు వీలుగా మూడో నంబరు గదిలోకి మారుస్తామని తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. మరణ శిక్ష అమలుకు ముందు నేరస్థులను ఆఖరి సారిగా వారి కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతిస్తామని తెలిపారు. ‘‘ఇప్పటి వరకు మిగిలిన ఖైదీల మాదిరిగానే వారానికి రెండుసార్లు కుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉండేది. కానీ సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఈ అవకాశం ఉండదు. వారి శిక్ష అమలుకు ముందు కేవలం ఒక్కసారి మాత్రమే కుటుంబాన్ని కలిసే అనుమతి ఉంటుంది. శిక్షను అమలు చేసే విధివిధానాలను మేము దోషులకు వివరించాం.’’ అని అధికారులు వివరించారు.

‘‘వారు సాధారణంగానే ఉన్నారు. వారి ప్రవర్తన అసహజంగా ఏమీ లేదు. బహుశా వారు ఇంకా పరిస్థితిని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలోనే ఉండొచ్చు. లేదా ఉరిశిక్ష అమలు ఆగుతుందనే ఆశావహ దృక్పథంతో ఉండొచ్చు. శిక్ష అమలుకు బక్సర్‌ నుంచి తాళ్లను తెప్పించాము. ఉరితీతకు ఇద్దరు తలారులను పంపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాము. కానీ ఇది సాధ్యం కాదని వారు తెలిపారు. ప్రస్తుతానికి మేరట్‌కు చెందిన తలారి పవన్‌ కుమార్‌నే ఈ నలుగురి ఉరితీతకు ఉపయోగిస్తాం’’ అని అధికారులు వివరించారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని