రైతుల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

తాజా వార్తలు

Updated : 19/01/2020 18:53 IST

రైతుల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

జాతీయ నేర నమోదు సంస్థ వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలే ఎక్కువ అని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. 2018లో సగటున రోజుకు 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధి ఉన్న వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. 

2018లో దేశవ్యాప్తంగా 10,349 మంది వ్యవసాయ రంగానికి చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోగా.. 13,149 మంది స్వయం ఉపాధి గల వ్యక్తులు, 12,936 మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. మొత్తంగా 2018లో 1,34,516 ఆత్మహత్య ఘటనలు నమోదైనట్లు తెలిపింది. 2017తో పోలిస్తే ఇది 3.6శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక 2018లో మొత్తం 42,931 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడగా.. వీరిలో 54.1శాతం(22,937) మంది గృహిణులేనని పేర్కొంది. 

ఇక ఆత్మహత్యలు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర(17,972) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు(13,896), పశ్చిమబెంగాల్‌ (13,225), మధ్యప్రదేశ్‌(11,775), కర్ణాటక(11,561) రాష్ట్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్య ఘటనల్లో సగానికి పైగా (50.9శాతం) ఈ ఐదు రాష్ట్రాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని