కొత్త హెయిర్‌ స్టైల్‌తో స్మృతి ఇరానీ..!

తాజా వార్తలు

Published : 18/02/2020 01:21 IST

కొత్త హెయిర్‌ స్టైల్‌తో స్మృతి ఇరానీ..!

సాధారణ వ్యక్తిగా ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి

దిల్లీ: కేంద్ర మహిళా, శిశుసంక్షేమ, జౌళీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్మృతి ఇరానీ తన అభిప్రాయాలను, సొంత విషయాలనూ పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్యే తన కూతురు, భర్తకు నచ్చిన వంటలను చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్న ఈ కేంద్ర మంత్రి, తాజాగా మరో కొత్త లుక్‌తో తన అభిమానుల ముందుకొచ్చింది. ఈ ఆదివారం నాడు తాను సాధారణ వ్యక్తిగా ఆటోలో ప్రయాణించినట్లు తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పేర్కొంది. పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ‘చాలా రోజుల తరువాత..ఆటోకి సవారి’ అంటూ ఆటోలో ప్రయాణంతో చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. 

ఆటో ప్రయాణం అనంతరం కొన్ని గంటలకు..మరో ఫోటోను పోస్టు చేస్తూ..తన హెయిర్‌ కట్‌ చేయించిన ఫోటోను జతచేసింది. ఈ ఫోటోలో తను హెయిర్‌ను భుజాల వరకు తగ్గించి స్టైల్‌గా ఉన్న సెల్ఫీని పోస్టు చేసింది. ‘హెయిర్‌ కట్‌ కియా, జో కల్‌ ఫిర్‌ బాంద్‌ లూంగీ..’(హెయిర్‌ కట్‌ చేయించాను..రేపు మళ్లీ ముడేసుకుంటా)అంటూ అభిమానులతో పంచుకుంది. దీంతో చాలా బాగుంది..వీ లైక్‌ ఇట్‌ అంటూ అభిమానులు రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు.

స్మృతి ఇరానీకి ఇన్‌స్టాగ్రాంలో దాదాపు ఏడున్నర లక్షల ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని