మక్కా యాత్రపై కరోనా ఎఫెక్ట్‌..!

తాజా వార్తలు

Published : 27/02/2020 11:19 IST

మక్కా యాత్రపై కరోనా ఎఫెక్ట్‌..!

రియాద్‌: కరోన ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి పవిత్ర మక్కాలోకి అనుమతులను నిలిపివేస్తున్నట్లు తాజాగా సౌదీఅరేబియా ప్రకటించింది. కరోనా వైరస్‌( కోవిడ్‌-19) ఇప్పటికే చైనాతో పాటు వివిధ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల సంఖ్య చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, యూరప్‌, ఆసియా, తూర్పు మధ్య దేశాల్లో మాత్రం  వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే ఇరాన్‌లో 15మంది మరణించగా.. గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల్లో కూడా కరోనా ప్రభావం అధికంగా ఉంది. దీంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం, మక్కాకు వచ్చే యాత్రికులకు కొత్తగా వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. 

ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు కేవలం హజ్‌ సమయంలోనే కాకుండా(ఉమ్రా) సంవత్సరం పొడువునా లక్షల సంఖ్యలో యాత్రికుల తాకిడి ఉంటుంది. దీనికోసం సౌదీఅరేబియా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రత్యేక వీసాలను జారీచేస్తుంటుంది. అయితే కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ వీసాల జారీ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించేవారిని కూడా అనుమతించమని పేర్కొంది. అయితే, ఈ తాత్కాలిక నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అంతేకాకుండా ఏ దేశాల నుంచి వచ్చే వారిని అనుమతించరనే దానిపై ఇంకా  స్పష్టత ఇవ్వలేదు. కేవలం కరోనా వైరస్‌ వ్యాపించిన దేశాల నుంచి వచ్చే వారిని అనుమతించమని మాత్రమే క్లుప్తంగా తెలిపింది. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని