ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది...

తాజా వార్తలు

Published : 04/03/2020 20:43 IST

ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది...

ఎప్పుడైనా తిరిగిరావచ్చని ప్రిన్స్‌ హ్యారీకి తెలిపిన బ్రిటన్‌ మహారాణి

లండన్‌: బ్రిటిష్‌ యువరాజు హ్యారీ ఎప్పుడు తిరిగి వచ్చినా అతనికి, అతని కుటుంబానికి హృదయపూర్వక ఆహ్వానం ఉంటుందని బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు. ఈ నెల చివర ప్రిన్స్‌ హ్యారీ, ఆయన సతీమణి మేఘాన్‌ మెర్కెల్‌లు తమ కుమారుడు ప్రిన్స్‌ ఆర్చీతో సహా రాజకుటుంబ సభ్యుల హోదాను వీడి వెళ్లనున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన విడుదల చేశారు. 

ఇటీవల  ఎలిజబెత్‌,  హ్యారీతో సమావేశమయ్యారు. రాచరికాన్ని త్యజించాలన్న నిర్ణయం తరువాత బామ్మ, మనుమడు మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఈ ఆత్మీయ సమావేశంలో తొలిసారిగా వీలుచిక్కింది. ఈ సందర్భంగా హ్యారీ, మేఘన్‌ల తొమ్మిది నెలల చిన్నారి ఆర్చీ గురించి, వారి భవిష్యత్‌ ప్రణాళికలను గురించి ఇంకా అనేక విషయాలు కూడా చర్చకు వచ్చాయి. అనంతరం తన చిన్న మనుమడు హ్యారీ, రాజకుటుంబంలో అందరూ ఇష్టపడే సభ్యుడని క్వీన్‌ ఎలిజబెత్‌ వివరించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని