స్వీయ నిర్బంధంలో సురేష్‌ ప్రభు

తాజా వార్తలు

Updated : 18/03/2020 17:19 IST

స్వీయ నిర్బంధంలో సురేష్‌ ప్రభు

దిల్లీ: భారత్‌ తరపున జీ20 సదస్సు ప్రతినిధి, భాజపా ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధం విధించుకున్నట్లు తెలిపారు. దీంతో 14రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేనని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు  ఈమేరకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్‌ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్తగా చేయించుకున్న పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గానే తేలింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్‌ సమయం ముగిసే వరకూ పార్లమెంటు సమావేశాలకు సైతం హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నా’అని ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే నిన్న కేంద్రమంత్రి మురళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని