24 గంటల్లో దిల్లీలో సున్నా కేసులు, కానీ...

తాజా వార్తలు

Published : 24/03/2020 15:43 IST

24 గంటల్లో దిల్లీలో సున్నా కేసులు, కానీ...

అసలు సవాలు ముందుంది: అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. అంతేకాకుండా, దిల్లీలో కొవిడ్‌-19 సోకిన ఐదుగురు బాధితులు చికిత్స అనంతరం నయమై తమ ఇళ్లకు వెళ్లారని అయన వివరించారు. అయితే ఇందుకు తాను సంతోషించటం లేదని... పరిస్థితి ఇకపై అదుపు తప్పకుండా నియంత్రించటమే అతి పెద్ద సవాలు అని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటి వరకు దిల్లీలో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నేటి నుంచి ప్రత్యేక ‘కర్ఫ్యూ పాస్‌’ లు ఉంటే తప్ప బయటి వ్యక్తులకు దిల్లీలోకి ప్రవేశం నిషిద్ధమని దిల్లీ పోలీసులు ప్రకటించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని