బంగ్లా,భూటాన్‌,అఫ్గాన్‌,లంకకు భారత ఆర్మీ 

తాజా వార్తలు

Published : 22/04/2020 00:45 IST

బంగ్లా,భూటాన్‌,అఫ్గాన్‌,లంకకు భారత ఆర్మీ 

దిల్లీ: కరోనాపై పోరాటంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌కు సహాయం చేసేందుకు భారత సైన్యం బృందాలను సిద్ధం చేస్తోంది. ప్రయోగశాలల ఏర్పాటు, వైద్యసిబ్బందికి శిక్షణనివ్వడంలో వారికి బృందాలు తోడుగా నిలవనున్నాయి. గత నెల్లో 14 మందితో కూడిన భారత సైనిక బృందం మాల్దీవులకు వెళ్లింది. ప్రయోగశాలలు ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. మహమ్మారితో పోరాటానికి వారిని సిద్ధం చేస్తోంది. ద్వైపాక్షిక సహకార చర్యల్లో భాగంగా 15 మంది సభ్యుల బృందాన్ని కువైట్‌ సైతం పంపించింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌కు వెళ్లాల్సిన బృందాలు సైతం సిద్ధమయ్యాయని తెలుస్తోంది. సార్క్‌ దేశాల్లో కరోనాపై పోరాటానికి భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15న సంయుక్త వ్యూహం గురించి మాట్లాడారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసి 10 మిలియన్‌ డాలర్లు ప్రకటించారు. ఈ నిధికి భారత్‌ ఇప్పటికే డబ్బులు పంపించినట్లు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని