బెంగాల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ!
close

తాజా వార్తలు

Published : 22/05/2020 10:42 IST

బెంగాల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ!

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ పెనుతుపాన్‌ పశ్చిమబెంగాల్‌లో భారీ భీభత్సం సృష్టించింది. పెనుతుపాను కారణంగా రాష్ట్రంలో 72మంది మరణించగా భారీ ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం పశ్చిమబెంగాల్‌ బయలుదేరారు. పశ్చిమబెంగాల్‌తోపాటు ఒడిశాలో ప్రధాని ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లతో కలిసి పరిస్థితి సమీక్షించే అవకాశం ఉంది. పెనుతుపానుతో సంభవించిన నష్టంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలపై వీరు చర్చిస్తారు. ఇదిలా ఉంటే, కనీవిని ఎరుగని పెనుతుపాను ధాటికి కోల్‌కతా నగరంతోపాటు బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు వణికిపోయాయి. తన జీవితంలో ఇలాంటి విలయాన్ని ఎన్నడూ చూడలేదని..కరోనా కంటే ఈ పెనుతుపానే తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని