48గంటల్లో 278 పోలీసులకు కరోనా!

తాజా వార్తలు

Published : 22/05/2020 17:33 IST

48గంటల్లో 278 పోలీసులకు కరోనా!

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 2345పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతోపాటు 64మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,642కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 1454మంది మృత్యువాతపడ్డారు. కేవలం ఒక్క ముంబయి నగరంలోనే నిన్న ఒక్కరోజు 1382 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ముంబయి నగరంలో మొత్తం కేసుల సంఖ్య 25,317కి చేరింది.

రెండురోజుల్లో 278మంది పోలీసులకు కరోనా..

ముంబయి నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కలవరపెడుతోంది. తాజాగా గడచిన 48గంటల్లో రాష్ట్రంలో 278 మంది పోలీసు సిబ్బంది ఈ వైరస్‌ బారినపడినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 1666మంది పోలీసులకు ఈ వైరస్‌ సోకగా..వీరిలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన పోలీసు బాధితుల్లో 473మంది ఇప్పటికే కోలుకోగా మరో 1177మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వ నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు..

రాష్ట్ర్లంలో కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకల కొరత ఏర్పడింది. అంతేకాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న దాదాపు 80శాతం పడకలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నిర్ణయంతో ఐసీయూ పడకలన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. వీటిలో కొవిడ్‌-19 రోగులకు 2624పడకలు, మరో 3020 పడకలు అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆగస్టు 31వరకు ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా ఈ 80శాతం పడకల్లో చికిత్సకు ఎంత ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వమే నిర్ణయించింది. మిగతా 20శాతం పడకలపై మాత్రం ఆసుపత్రులు సొంతంగా ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిపే దాదాపు అన్నిరకాల సర్జరీలకు ఈ నియంత్రణ వర్తించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని