స్టేడియంలో ప్రత్యక్షమైన ఒసామా బిన్‌లాడెన్‌

తాజా వార్తలు

Published : 03/07/2020 12:23 IST

స్టేడియంలో ప్రత్యక్షమైన ఒసామా బిన్‌లాడెన్‌

వెస్ట్‌ యార్క్‌షైర్‌: అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్‌ ఇటీవల ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న ఓ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. తొమ్మిదేళ్ల కిందటే చనిపోయిన లాడెన్‌ ఇప్పుడు ఎలా వచ్చాడని తలపట్టుకోకండి.. చనిపోయిన మనిషి తిరిగి రాలేడు.. కానీ ఆయన కటౌట్‌ ఒకటి స్టేడియంలో ప్రేక్షకుల గ్యాలరీలో దర్శనమిచ్చింది. వివరాళ్లోకి వెళ్తే..

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా క్రీడాపోటీలు ప్రేక్షకులు లేకుండానే జరుపుకొనేందుకు ప్రభుత్వాలు అనుమితిచ్చిన విషయం తెలిసిందే. అసలు ప్రేక్షకులు లేకుంటే ఏం బాగుంటుందని భావించిన కొన్ని స్టేడియాల నిర్వాహకులు బొమ్మలు, మనిషి ఫొటోలతో చేసిన కటౌట్లను గ్యాలరీల్లో పెడుతున్నారు. ఈ విధానాన్నే ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఫాలో అయింది. అయితే మ్యాచ్‌ను నేరుగా చూడలేకపోతున్న వారు వారి ఫొటోలను, లేదా వారి కటౌట్లను పంపాలని, వాటిని స్టేడియం గ్యాలరీలో పెడతామని వెల్లడించింది. దీంతో అనేకమంది వారి ఫొటోతో కూడిన కటౌట్లను పంపించారు. అందులో ఒకరు తన ఫొటో బదులు ఒసామా బిన్‌ లాడెన్‌ కటౌట్‌ను పంపారు. ఎలాండ్‌ రోడ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు దానిని గమనించకుండా ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ పంపిన కటౌట్లతోపాటు లాడెన్‌ కటౌట్‌నూ పెట్టేశారు. అది కాస్త ట్విటర్‌లో వైరల్ కావడంతో ఫుట్‌బాల్‌ క్లబ్‌ యాజమాన్యం ఆ కటౌట్‌ను తొలగించింది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలిపింది.

ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా ఒకటి జరిగింది. జూన్‌ మొదటివారంలో ఆస్ట్రేలియా నేషనల్‌ రగ్బీ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన సీరియల్‌ కిల్లర్‌ హరొల్డ్‌ షిప్‌మన్‌ ముఖమున్న కటౌట్ ఒకటి ప్రత్యక్షమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని