PM cares: అత్యవసరం అట్టపెట్టెల్లో!
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PM cares: అత్యవసరం అట్టపెట్టెల్లో!

పీఎం కేర్స్‌ కింద గతేడాది వెంటిలేటర్ల సరఫరా
మత్తు వైద్యులు, టెక్నీషియన్ల కొరతతో ఇబ్బందులు


ఈనాడు డిజిటల్‌- కర్నూలు, విశాఖపట్నం: ఓ పక్క దేశవ్యాప్తంగా కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండగా.. మరోపక్క జిల్లా ఆస్పత్రులకు కేంద్రం అందించిన విలువైన వైద్య పరికరాలు ఏడాది కాలంగా నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. గతేడాది కరోనా మొదటి దశ సమయంలో ప్రధానమంత్రి కేర్స్‌ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దశల వారీగా వెంటిలేటర్లను ఇచ్చారు. 1,030 వెంటిలేటర్లు రాగా, వీటిలో కొన్నింటిని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇంకా కొన్ని ఆయా ఆస్పత్రుల ఆవరణలో అట్టపెట్టల్లో మూలకు చేరాయి. ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు అలంకారప్రాయంగా వదిలేశారు. ప్రతి పది పడకలకు ఒక అనస్తీషియా, 3 పడకలకు ఒక స్టాఫ్‌నర్సు ఉండాలి. మత్తు వైద్యులు, స్టాఫ్‌నర్సుల కొరతతోతో వెంటిలేటర్లు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు.

నంద్యాల జిల్లా ఆసుపత్రిలో: నంద్యాల జిల్లా ఆసుపత్రిలో పాతవి 12 వెంటిలేటర్ల వరకు ఉండగా గతేడాది రెండు విడతలుగా పీఎంకేర్‌ కింద 60 అందజేశారు. మొత్తం 72కాగా 34 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో కొవిడ్‌ అత్యవసర సేవలకు 10, ఐసీయూ జనరల్‌ వార్డులో మిగిలిన 24 వెంటిలేటర్లను ఉంచారు. కొవిడ్‌కు రోగులకు 10 వెంటిలేటర్లు సరిపోక, కర్నూలు సర్వజన వైద్యశాలకు పంపిస్తున్నారు. గంటన్నర ప్రయాణం చేసి కర్నూలు పెద్దాసుపత్రికి చేరేలోగా ఆక్సిజన్‌ స్థాయి తగ్గి రోగులు మరణిస్తున్నారు. సాంకేతిక సిబ్బంది లేనందున 20కిపైగా వెంటిలేటర్లను అట్టపెట్టల్లో, మరికొన్ని హెచ్‌డీయూలో పెట్టారు.

పాడేరులోనూ: 

విశాఖపట్నంలోని పాడేరు జిల్లా ఆసుపత్రికి గతేడాది 60 వెంటిలేటర్లు అందాయి. అప్పట్లో విశాఖలోని విమ్స్‌కు 35 తరలించారు. మిగిలిన 25 పరికరాలు ఏడాదిగా నిరుపయోగంగా మారాయి. ఇక్కడ మత్తు వైద్యులు లేరు. అత్యవసర వైద్యానికి కొవిడ్‌ రోగులు 200 కి.మీ.లు ప్రయాణించి కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. వెంటిలేటర్‌ వైద్యం అందక పాడేరు పరిధిలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. వెంటిలేటర్లలో ఉపయోగంలో లేనివి ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వాలని, ఎక్కడ తక్కువుంటే అక్కడికి వాటిని పంపించాలంటూ రెండురోజుల కిందట కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల వైద్యాధికారులను కోరినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని