Corona: మృతుల్లో 24 గంటల తర్వాత వైరస్‌ ఉండదు

తాజా వార్తలు

Published : 26/05/2021 13:16 IST

Corona: మృతుల్లో 24 గంటల తర్వాత వైరస్‌ ఉండదు

ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ అధిపతి డాక్టర్‌ సుధీర్‌ గుప్తా

దిల్లీ: కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారి ముక్కు, నోటిలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్‌ క్రియాశీలంగా ఉండదని ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగ అధిపతి డాక్టర్‌ సుధీర్‌ గుప్తా స్పష్టం చేశారు. అందువల్ల కరోనాతో చనిపోయినవారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం దాదాపు ఉండదని తెలిపారు. ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగంలో గత ఏడాది కాలంగా దీనిపై ప్రయోగాత్మక అధ్యయనం చేపట్టారు. ఈమేరకు కొవిడ్‌-19 పాజిటివ్‌ మెడికో-లీగల్‌ కేసులకు సంబంధించి జరిపిన పోస్ట్‌మార్టమ్‌లో పలు అంశాలను కనుగొన్నారు. కొవిడ్‌తో చనిపోయిన దాదాపు 100 మంది మృతదేహాలకు 12-24 గంటల తర్వాత కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ గుప్త తెలిపారు.

అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. కరోనా మృతుల ముక్కు, నోటి నుంచి ఎలాంటి ద్రవాలు బయటకు రాకుండా మూసివేయాలని సూచించారు. అలాగే మృతదేహాలను క్రిమిరహితంగా చేయాలని చెప్పారు. ఇలాంటి మృతదేహాలను పట్టుకునే వ్యక్తులు పీపీఈ కిట్లు, మాస్కులు, చేతితొడుగులు వంటి రక్షణ కవచాలను తప్పక ధరించాలని సూచించారు. అంత్యక్రియల అనంతరం అస్థికలు, చితాభస్మం వంటివి సేకరించడం వల్ల ఎలాంటి ముప్పు ఉండదని.. వాటి నుంచి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కరోనాతో చనిపోయినవారికి గౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్న ఉద్దేశంతో ఈ అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని