స్విగ్గీ డెలివరీ బాయ్‌గా.. ఆడీ కార్‌ యజమాని
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 14:58 IST

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా.. ఆడీ కార్‌ యజమాని

రీదైన కార్లలో ఒకటైన ఆడీ ఆర్‌8ను దిల్లీలో స్విగ్గీ ఫుడ్‌ డెలివరీకి ఉపయోగిస్తున్నాడో యజమాని. తానే స్వయంగా ఆర్డర్లు ఓకే చేసి, కస్టమర్ల ఇంటికి ఆహారాన్ని చేరవేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్‌ వ్లాగ్‌లో పోస్టు చేశాడు. తాను గతంలో హెచ్‌2 సూపర్‌బైక్‌పై ఫుడ్‌ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని అందరూ అడగడంతో ఇలా చేస్తున్నట్లు చెప్పాడు. తనతో పాటు స్విగ్గీ దుస్తులు ధరించిన మరో వ్యక్తి కారులో ఉంటాడు. ట్రాఫిక్‌ వల్ల ఎక్కువ ఆర్డర్లు తీసుకోలేకపోతున్నా.. ఈ కారులో డ్రైవింగ్‌ సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని