Goa: ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Goa: ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు

పనాజీ: కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొవిడ్‌ చికిత్సకు కేటాయించిన ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఆసుపత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. ఈ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది యథావిధిగా కొనసాగుతారని, నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని చెప్పారు. ప్రతి ఆసుపత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. కొవిడ్‌ బాధితుల కోసం 50 శాతం పడకలు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని