Sana: పాక్‌లో హిందూ మహిళ చరిత్ర
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sana: పాక్‌లో హిందూ మహిళ చరిత్ర

పాకిస్థాన్‌ పీఏఎస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళగా ఘనత

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ చరిత్రలోనే తొలిసారి ఓ హిందూ యువతి ఆ దేశ అత్యున్నత సర్వీసు అయిన పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (పీఏఎస్‌)కు ఎంపికైంది. సింధ్‌ ప్రావిన్స్‌లోని షికార్‌పుర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ వైద్యురాలు సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించారు. పాక్‌ ప్రభుత్వం నిర్వహించిన సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ (సీఎస్‌ఎస్‌) పరీక్షలను మొత్తం 18,533 మంది రాశారు. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం 221 మందితో తుది జాబితా విడుదల చేశారు. అందులో సనా రామ్‌చంద్‌ పేరు కూడా ఉంది. ఇది మన దేశంలో ఐఏఎస్‌తో సమానం. ఫలితాల అనంతరం ‘‘వాహే గురూ జీ కా ఖల్సా వాహే గురూజీ కి ఫతే’’ అని రామ్‌చంద్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘనత తన తల్లిదండ్రులకు దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. పీఏఎస్‌ సాధించిన వారు ముందు అసిస్టెంట్‌ కమిషనర్లుగా, తర్వాత జిల్లా కమిషనర్లుగా పదోన్నతి పొందుతారు. రామ్‌చంద్‌ తన ఎంబీబీఎస్‌ను సింధ్‌ ప్రావిన్స్‌లోని చంద్కా మెడికల్‌ కళాశాలలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె సింధ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీ, ట్రాన్స్‌పరెంట్‌లో ఎఫ్‌సీపీఎస్‌ చేస్తున్నారు. ఇది పూర్తవ్వగానే సర్జన్‌గా అర్హత సాధిస్తారు. పాకిస్థాన్‌లో అత్యధిక హిందూ జనాభా సింధ్‌ ప్రావిన్స్‌లోనే ఉంటారు. ఆమె ఘనతపై ఆ దేశ రాజకీయనాయకులు కూడా స్పందించారు. ‘‘సింధ్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోని హిందూ సమాజం గర్వపడేలా సనా రామ్‌చంద్‌ చేశారు’’ అని పాకిస్థాన్‌ పీపుల్‌ పార్టీకి చెందిన ఫర్హాతుల్లా బాబర్‌ ట్వీట్‌ చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని