Black Fungus చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చండి

తాజా వార్తలు

Published : 22/05/2021 14:58 IST

Black Fungus చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చండి

ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ

దిల్లీ: కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్​ ఫంగస్​ భయపెడుతోంది. దీనిపై వెంటనే దృష్టి సారించి రోగులకు అత్యవసర చికిత్స అందజేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్​ ఫంగస్​ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బ్లాక్​ ఫంగస్​ చికిత్సలో ఉపయోగించే ‘ఆంఫోటెరిసిన్​-బి’ ఔషధానికి కొరత ఏర్పడింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వెంటనే ఈ ఔషధం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీని కోరారు. అలా బ్లాక్‌ ఫంగస్‌గా పేర్కొంటున్న మ్యూకోర్‌ మైకోసిస్‌ చికిత్సను ఉచిత వైద్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు దేశీయగా ‘ఆంఫోటెరిసిన్​-బి’​ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కేంద్రం తెలిపింది. అవసరమైతే ప్రపంచ దేశాల తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా అందుబాటులో ఉంచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని