కరోనా మరణాలు@81

తాజా వార్తలు

Updated : 16/02/2021 10:25 IST

కరోనా మరణాలు@81

9,121 పాజిటివ్ కేసులు 

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు పది వేల దిగువకు పడిపోయాయి. అలాగే మరణాలు 100 లోపునే నమోదయ్యాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 6,15,664 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..9,121 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 81 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లకు పైబడగా..1,55,813 మరణాలు సంభవించాయి. 

ఇక, నిన్న ఒక్కరోజే 11,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైబడగా..ఆ రేటు 97.32 శాతానికి చేరింది. అలాగే దేశంలో 1,36,872 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. దాంతో క్రియాశీల రేటు 1.25 శాతంగా ఉంది. 

మరోవైపు, ఫిబ్రవరి 15 నాటికి 87,20,822 మంది పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది కరోనా టీకా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే 4,35,527 మంది టీకా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అలాగే టీకా మొదటి డోసు తీసుకొని 28 రోజులు పూర్తయిన వారికి ఫిబ్రవరి 13 నుంచి ప్రభుత్వం రెండో డోసును పంపిణీ చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని