close

తాజా వార్తలు

Published : 01/03/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

15,510 కొత్త కేసులు..106 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోల్చితే రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించింది. ఆదివారం 15,510 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలకు పైబడింది. మరణాల సంఖ్య వందకుపైనే కొనసాగుతోంది. తాజాగా 106 మంది వైరస్‌కు బలవ్వగా..ఇప్పటి వరకు 1,57,157 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు. 

అయితే క్రియాశీల కేసులు రోజురోజుకూ పెరుగుతుండటమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల్లో పెరుగుదల, రికవరీల్లో తగ్గుదల మూలంగా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 1,68,627 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.52 శాతానికి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 11,288 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీలు 1.07కోట్లకు పైబడగా..ఆ రేటు 97.07శాతంగా ఉంది. నిన్న 6,27,668 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

మరోవైపు, నేటి నుంచి రెండో దశ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు టీకా ఇస్తున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో తొలిడోసు టీకా తీసుకున్నట్లు ఈ రోజు ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు 1,43,01,266 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. మొదటి దశలో ఇప్పటికే ఒక డోసు తీసుకున్నవారికి రెండో డోసును అందిస్తున్నారు.  
 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని