Corona: 1.49 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

తాజా వార్తలు

Updated : 09/07/2021 11:53 IST

Corona: 1.49 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

మరోసారి పెరిగిన మృతుల సంఖ్య 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగుచూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 3.07 కోట్ల మందికిపైగా కరోనా సోకగా..4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు.

• నిన్న 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 42.7కోట్లకు చేరింది.

• గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.

• ప్రస్తుతం 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది.

• నిన్న 40,23,173 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య..36,89,91,222.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని