Corona: ఒక్కసారిగా తగ్గిన కొత్త కేసులు.. ఎన్నంటే..?

తాజా వార్తలు

Updated : 03/08/2021 09:50 IST

Corona: ఒక్కసారిగా తగ్గిన కొత్త కేసులు.. ఎన్నంటే..?

ముందురోజు మాదిరిగానే మరణాలు

దిల్లీ: గత కొద్ది రోజులుగా 40వేలకు పైగానే నమోదవుతోన్న కొత్త కేసులు ఒక్కసారిగా తగ్గాయి. ముందురోజు కంటే 24 శాతం క్షీణించి..30 వేలకు చేరాయి. మృతుల సంఖ్యలో మాత్రం మార్పులేదు. అంతకుముందురోజు మాదిరిగానే 400పైగా మరణాలు వెలుగుచూశాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

 తాజాగా 30,549 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా పడిపోవడమే ఈ తగ్గుదలకు కారణం. అక్కడ వరుసగా 13,984, 4,869 కేసులు బయటపడ్డాయి. 

⇒ నిన్న మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు వైరస్‌ ధాటికి బలైనవారి సంఖ్య 4.25లక్షలుగా ఉంది. 

⇒ ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగులక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం 4,04,958 మంది కొవిడ్‌తో బాధపడుతన్నారు. క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉంది. 

⇒ నిన్న 38,887 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.08కోట్లకు చేరగా.. ఆ రేటు 97.38 శాతంగా కొనసాగుతోంది. 

⇒ నిన్న 16,49,295 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 47,12,94,789కి చేరిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

⇒ అలాగే నిన్న 61లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 47,85,44,114కి చేరింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని