
తాజా వార్తలు
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
దిల్లీ: జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పొడిగించింది. ఈ నెల 23వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు విధించింది. ఈనెల 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. గత ఏడాది డిసెంబరు 16న మొదలైన జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అయితే గోరఖ్‌పూర్‌లోని మదన్మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
ఇవీ చదవండి..
శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
‘వాటిని తెరిచే ముందు మాకు టీకా ఇవ్వండి’
Tags :