అసహనానికి మారుపేరు మమతాబెనర్జీ: నడ్డా
close

తాజా వార్తలు

Published : 10/12/2020 00:57 IST

అసహనానికి మారుపేరు మమతాబెనర్జీ: నడ్డా

కోల్‌కతా: అసహనానికి మారుపేరు బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ అని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌కు చేరకున్న నడ్డా అధికార టీఎంసీ పార్టీ, సీఎం మమతాబెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు.  ‘శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చెప్పిన రెండు విషయాల్ని నేను ఈ రోజు మీకు గుర్తుచేయదలచుకున్నా. ముఖర్జీ క్రమశిక్షణ, సహనం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండూ మనకు అవసరం. కానీ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాత్రం అసహనానికి మారుపేరు’ అని విమర్శించారు. 

‘దేశమంతా ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించింది. కానీ బెంగాల్‌ ప్రజలు ఆ కార్యక్రమాన్ని వీక్షించకుండా మమతా లాక్‌డౌన్‌ విధించి అడ్డుకున్నారు. కానీ అదే లాక్‌డౌన్‌ను బక్రీద్‌ పండగ కోసం మాత్రం మినహాయింపు చేశారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు’ అని నడ్డా దుయ్యబట్టారు. పశ్చిమబెంగాల్లో 2021లో జరగబోయే ఎన్నికల్లో భాజపా 200 స్థానాలతో ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో నడ్డా బుధవారం సాయంత్రం కాళీఘాట్‌ ప్రాంతంలోని(మమతా ఇంటి సమీపం) ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, ప్రజల్ని మోహరించేందుకు పార్టీ సన్నాహాలు చేసింది. 

ఇదీ చదవండి

ఏలియన్స్‌ ఉన్నాయ్‌.. ఆ నిజం ట్రంప్‌కీ తెలుసు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని