​​​​​​ఆక్సిజన్‌ ట్యాంకర్లకు టోల్‌ నుంచి మినహాయింపు
close

తాజా వార్తలు

Published : 09/05/2021 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​ఆక్సిజన్‌ ట్యాంకర్లకు టోల్‌ నుంచి మినహాయింపు

దిల్లీ: కొవిడ్‌ సంక్షోభం వేళ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలకం నిర్ణయం తీసుకుంది. ద్రవరూపంలో ఉన్న మెడికల్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటెయినర్లకు టోల్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై అంబులెన్సుల మాదిరిగానే వీటిని పరిగణిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉత్తర్వులు రెండు నెలలు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. టోల్‌ ఫీజు మినహాయించడం వల్ల ఆక్సిజన్‌ ట్యాంకర్లు/కంటెయినర్లు మరింత వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుపడుతుందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ఈ మేరకు అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని