close

తాజా వార్తలు

Updated : 23/04/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

25మంది చనిపోయారు..ఆక్సిజన్‌ పంపండి ప్లీజ్‌

ప్రాణవాయువు కోసం దిల్లీ ఆసుపత్రి అత్యవసర సందేశం

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని దిల్లీలో అనేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు త్వరలో నిండుకోనున్నట్లు సమాచారం. ప్రముఖ సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రిలో మరో రెండు గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్‌ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ఉదయం తెలిపాయి. ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న 60 మంది రోగుల భవితవ్యం ప్రమాదంలోకి జారుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమయింది. దిల్లీ ప్రభుత్వానికి ఆస్పత్రి వర్గాలు అత్యవసర సందేశం(ఎస్‌ఓఎస్‌) పంపగా.. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆక్సిజన్‌ ట్యాంకర్లను రప్పించారు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. సాకేత్‌ ప్రాంతంలోని మ్యాక్స్‌ ఆస్పత్రికి సైతం ఉదయం ఆక్సిజన్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి. మరోవైపు గత 24 గంటల్లో 25 మంది రోగులు మరణించినట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 510 మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో 142 మందికి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందజేస్తున్నారు. బాధితుల పరిస్థితి రోజురోజుకీ విషమిస్తుండడంతో ఆక్సిజన్‌ అవసరమూ ఎక్కువవుతోంది. మరోవైపు కొవిడ్‌ తీవ్రత తర్వాత కేంద్రం ఆక్సిజన్‌ సరఫరాను స్వయంగా చేపట్టింది. నేరుగా దిగుమతి చేసుకునేందుకు వీల్లేకుండా ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కేటాయింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా గురువారమే దిల్లీలోని ఆస్పత్రులకు కేంద్రం ఆక్సిజన్‌ సిలిండర్లు పంపింది. కానీ, ఆ నిల్వలు నేటితోనే పూర్తయ్యాయి. మరోవైపు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ తమకు స్థానికంగా అవసరాలున్నాయని తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్‌ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని