Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 13:32 IST

Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా

దిల్లీ: ఓ వైపు పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఎదురవుతున్న వేళ వ్యాక్సిన్ల వృథా ఎక్కువ స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 11 వరకు రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్లలో 23శాతం డోసులు వృథా అయినట్లు ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. అత్యధికంగా తమిళనాడులో ఈ వృథా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

ఏప్రిల్‌ 11 నాటికి రాష్ట్రాలన్నింటికీ 10కోట్ల డోసుల టీకాలను కేటాయించగా.. ఇందులో 44లక్షలకు పైగా డోసులు వృథా అయినట్లు వెల్లడైంది. తమిళనాడులో 12.10శాతం, హరియాణాలో 9.74శాతం, పంజాబ్‌లో 8.12శాతం, మణిపూర్‌లో 7.8శాతం, తెలంగాణలో 7.55శాతం డోసులు నిరుపయోగమైనట్లు సహచట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, గోవా, డామన్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లో ఈ వృథా తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

దేశంలో టీకా వృథాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. డోసుల వృథా కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గతంలో సూచించింది. స్టాక్‌ను సకాలంలో ఉంచుకోవాలని, టీకా వినియోగానికి సంబంధించి కొవిన్‌, ఈవిన్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని