అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
close

తాజా వార్తలు

Published : 17/04/2021 19:22 IST

అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

న్యూదిల్లీ: వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల్లో మోదీ నిర్వహిస్తున్న రెండో సమావేశం కావడం గమనార్హం.

శుక్రవారం కూడా అధికారులతో మోదీ సమావేశమయ్యారు. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యతపై అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని