Corona: ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘నో వ్యాక్సిన్‌’!
close

తాజా వార్తలు

Published : 04/06/2021 19:40 IST

Corona: ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘నో వ్యాక్సిన్‌’!

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్లీ: వ్యాక్సిన్లను అక్రమంగా ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సినేషన్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. 18-44 సంవత్సరాలవారికి డబ్బులు చెల్లించి ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటోందని ప్రతిపక్ష అకాలీదళ్‌ ఆరోపించింది. కేంద్రం నుంచి రూ. 400 కొన్న వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1060కి అమ్ముతోందని, తిరిగి వాళ్లు ప్రజలకు రూ. 1560కి వ్యాక్సిన్‌ వేస్తున్నారని అకాళీదల్ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ గురువారం ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.

ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఇప్పటికే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న వ్యాక్సిన్లను తిరిగి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సిన్‌ ఫండ్‌ కింద ఆస్పత్రులు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఆదేశాలు వెలువడక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీరుతెన్నుల గురించి సమగ్రంగా వివరించాలని కోరింది. ఇవాళ ఉదయమే పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బీఎస్‌ సిద్ధూ మాట్లాడుతూ వ్యాక్సిన్లపై పట్టు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని మీడియాకు తెలిపారు. కరోనా చికిత్స, నమూనాల సేకరణ, నిర్ధారణ పరీక్షలు, టీకా శిబిరాల నిర్వహణ తదితర వ్యవహారాలు తాను చూసుకుంటున్నానని, టీకాల అంశం నా పరిధిలోనిది కాదని చెప్పారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే పంజాబ్‌ ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని