రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం 

తాజా వార్తలు

Published : 28/09/2020 19:17 IST

రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం 

దిల్లీ: దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేన చీఫ్‌ బదౌరియా, నావికాదళాధిపతి కరమ్‌బీర్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలు ఆయుధాల కొనుగోలు విధానాలను మరింత సులభతరం చేశారు. 
భారత్‌ చైనా మధ్య ఎల్‌ఏసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే ఐదేళ్లలో 130 బిలియన్‌ డాలర్లు విలువైన క్యాపిటల్‌ ప్రొక్యూర్మెంట్‌ (ఆయుధ కొనుగోళ్లు)  జరగవచ్చని ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని