Shashi Tharoor: మోదీ గడ్డంపై థరూర్‌ సెటైర్‌

తాజా వార్తలు

Published : 03/07/2021 12:34 IST

Shashi Tharoor: మోదీ గడ్డంపై థరూర్‌ సెటైర్‌

దిల్లీ: శశిథరూర్‌ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్‌ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఆయన ‘పొగోనోట్రోఫీ’ అనే పదం వాడి ట్విటర్‌లో హల్‌చల్‌ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. పొగోనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. కరోనా సమయంలో మోదీ కూడా పొగోనోట్రోఫీయే చేస్తున్నారంటూ థరూర్‌ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఓ కొత్త పదం నేర్పాలంటూ ట్విటర్‌లో ఓ వైద్యురాలు అడిగిన ప్రశ్నకు థరూర్‌ బదులిసూ- ‘‘నా స్నేహితుడు, ఆర్థికవేత్త రతిన్‌రాయ్‌ ఈ రోజు నాకు ఓ కొత్త పదం నేర్పించారు. పొగోనోట్రోఫీ. అంటే గడ్డం పెంచడం. మహమ్మారి వేళ ప్రధానికి కూడా పొగోనోట్రోఫీ  వ్యాపకంగా మారింది’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని