Haryana: కూలిన పాఠశాల పైకప్పు.. 25 మంది విద్యార్థులకు గాయాలు

తాజా వార్తలు

Published : 23/09/2021 23:26 IST

Haryana: కూలిన పాఠశాల పైకప్పు.. 25 మంది విద్యార్థులకు గాయాలు

హరియాణాలో ఘటన.. 5గురు విద్యార్థుల పరిస్థితి విషమం

(ప్రతీకాత్మక చిత్రం)

చండీగఢ్‌: హరియాణాలోని సోనేపత్‌ జిల్లాలో పాఠశాల భవనం కప్పుకూలింది.  గన్నౌర్‌లోని పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో సుమారు 25 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం దిల్లీకి దగ్గర్లోని ఖాన్‌పూర్‌కి పంపారు. ఇదే ప్రమాదంలో ముగ్గురు కూలీలు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని