Made in China toys: ఈ చైనా బొమ్మలు అమెరికాలో సీజ్‌.. భారత్‌లో మాత్రం పాపులర్

తాజా వార్తలు

Published : 22/10/2021 20:42 IST

Made in China toys: ఈ చైనా బొమ్మలు అమెరికాలో సీజ్‌.. భారత్‌లో మాత్రం పాపులర్

వాషింగ్టన్‌: చైనా నుంచి దిగుమతి అయిన చిన్నపిల్లల బొమ్మల్ని అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ప్రమాదకరమైన రసాయనాల పూత ఉన్నట్లు గుర్తించడంతో అధికారులు ఈ చర్య చేపట్టారు. హాలిడే షాపింగ్ సీజన్ ప్రారంభం కానుండటంతో బొమ్మల్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది. భారత్‌లో ఈ చైనా తయారీ బొమ్మలకు విపరీత ప్రాచుర్యం ఉండటం గమనార్హం.

చైనాలో తయారైన ఆ బొమ్మలకు అసురక్షిత స్థాయిలో సీసం, కాడ్మియం, బేరియం పూత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీబీపీ, కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ సేప్టీ కమిషన్ (సీపీఎస్‌సీ) అధికారులు జులై 16న మొదట వీటిని తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ల్యాబ్‌లో పరీక్షించగా రసాయనాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో అక్టోబర్ 4న అధికారులు సీజ్‌ చేశారు. వారు స్వాధీనం చేసుకున్నవాటిలో లగోరీ 7 స్టోన్ ఆట బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి. ఏడు రాళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి బంతితో వాటిని కొట్టడమే లగోరి ఆట. ఇది భారత్‌లో చాలా ప్రాచుర్యం పొందిన ఆట.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని