close
చిన్మయానంద్‌పై ఫిర్యాదు చేసిన యువతిపై కేసు!

షాజహాన్‌పూర్‌: భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన న్యాయశాస్త్ర విద్యార్థినితో పాటూ ఆమె ముగ్గురు స్నేహితులపై కూడా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న కేసు నమోదైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)  ఈ కేసును నమోదు చేసింది. స్వామి చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన యువతి స్నేహితులు ముగ్గురిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. బలంతపు డబ్బు వసూళ్లకు పాల్పడాలన్న అంశంపై వారు చర్చిస్తున్నట్లుగా పేర్కొంటున్న వీడియో క్లిప్పింగ్‌ లభించిన నేపథ్యంలో ప్రశ్నించినపుడు ఆ ముగ్గురు తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సారథి నవీన్‌ అరోరా చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.