close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజల భద్రత, మర్యాదలకు భరోసా

 ఉగ్రవాదంపై ఉక్కుపాదం
 డీజీపీల భేటీలో అమిత్‌ షా  

ఈనాడు, దిల్లీ: ఉగ్రవాదంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలనీ... ప్రజల భద్రత, మర్యాదలకు భరోసా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రాల డీజీపీలకు నిర్దేశించారు. బుధవారం 55వ డీజీపీల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. ఏటా కేంద్ర నిఘా విభాగం ఆధ్వర్యాన నిర్వహించే ఈ సమావేశాన్ని కొవిడ్‌-19 నేపథ్యంలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో చేపట్టారు. అమిత్‌ షా ప్రసంగిస్తూ... జాతీయభద్రత పరంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. జాతీయ భద్రత విషయంలో అన్ని భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్‌పీవోను రూపొందించుకోవాలి
వామపక్ష తీవ్రవాదంపై సదస్సులో చర్చ జరిగింది.ఈ సమస్యను నియంత్రించడానికి రాష్ట్రాలు మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌) రూపొందించాలని నిర్ణయించారు. అత్యంత మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు అధికారులకు హోంమంత్రి వర్చువల్‌ విధానంలో పోలీసు పతకాలను అందజేశారు. తాజా గణాంకాల ప్రకారం దేశ పారామిలటరీ దళాల్లో ఇప్పటివరకూ సుమారు 80 వేల మంది కొవిడ్‌-19కు గురికాగా, వారిలో 650 మంది మృతిచెందారు.
అంతర్గత భద్రతపై ప్రధాని సమీక్ష
డీజీపీల వార్షిక సమావేశం మధ్యలో ప్రధాని మోదీ వీడియో ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. దేశ అంతర్గత భద్రతా పరిస్థితులను అధికారులు ప్రధాని, హోంమంత్రికి వివరించారు. మరిన్ని ప్రజానుకూల విధానాలతో భద్రతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారంతా చర్చించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన