టీకా కార్యక్రమం వేగం పెంచండి 

ప్రధానాంశాలు

Updated : 07/02/2021 09:36 IST

టీకా కార్యక్రమం వేగం పెంచండి  

రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా టీకా కార్యక్రమ వేగాన్ని గణనీయంగా పెంచాలని కేంద్రం శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ నెల 20లోగా అందరు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కనీసం ఒకసారి టీకా వేయాలని సూచించింది. టీకా కార్యక్రమం ప్రారంభమైన జవనరి 16న టీకా వేయించుకున్న వారంతా ఈ నెల 13 నుంచి రెండో డోసు వేయించుకునేలా చూడాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ విజ్ఞప్తి చేశారు. కొవిన్‌ అప్లికేషన్‌ 2.0 వెర్షన్‌ను త్వరలోనే ఆవిష్కరిస్తామని వెల్లడించారు. రోజుకు వేసే టీకాల సంఖ్య సగటును పెంచేందుకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని శనివారమిక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ‘‘రోజుకు వేస్తున్న టీకాల సగటులో వ్యత్యాసాలను విశ్లేషించాల్సిందిగా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులను కోరుతున్నాం. ఈ సగటును పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కొవిన్‌ డిజిటల్‌ వేదికలో నమోదుచేసుకున్న అందరికీ (100 శాతం) టీకాలు వేసేలా చూడాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం. టీకాల కార్యక్రమం లక్ష్యం చేరుకునేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం తనకు అనుగుణమైన వ్యూహం రూపొందించుకోవాలని సూచించాం’’ అని ఆ ప్రకటన వివరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన