
ప్రధానాంశాలు
అంతరిక్షంలోకి వెళ్లనున్న క్యాన్సర్ విజేత
కేప్ కెనావెరాల్: ఎముకల క్యాన్సర్ నుంచి కోలుకున్న ఒక మహిళ అంతరిక్షంలోకి పయనం కానున్నారు. స్పేస్ఎక్స్ సంస్థ చేపట్టే తొలి ప్రైవేటు రోదసి యాత్ర ద్వారా ఆమె ఈ సాహసం చేయనున్నారు.
హేలీ ఆర్సెనోవ్ అనే ఈ 29 ఏళ్ల మహిళ సెయింట్ జూడ్ పిల్లల ఆసుపత్రిలో ఫిచ్కీజీజిషియన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె జేర్డ్ ఇజాక్మాన్ అనే వ్యాపారవేత్తతో కలిసి ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్ర చేస్తారు. తద్వారా రోదసిలోకి వెళ్లిన అత్యంత పిన్నవయస్కురాలైన అమెరికన్‌గా రికార్డు సృష్టించనున్నారు. అలాగే కృత్రిమ శరీర భాగంతో అంతరిక్షంలోకి వెళుతున్న తొలి మహిళగా కూడా హేలీ గుర్తింపు పొందనున్నారు. 10 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్ కారణంగా ఆమె తన మోకాలును మార్పించుకోవాల్సి వచ్చింది. తొడ ఎముకలోనూ టైటానియం కడ్డీని అమర్చారు. ఇప్పటికీ ఆమెకు కాళ్లలో నొప్పి తలెత్తుతుంటుంది. అయినా స్పేస్ఎక్స్ యాత్రకు ఎంపికయ్యారు. వ్యోమనౌకలో వైద్య అధికారిగా ఆమె వ్యవహరిస్తారు. సెయింట్ జూడ్ ఆసుపత్రికి నిధులు సేకరించేందుకు ఇజాక్మాన్ ఈ అంతరిక్ష యాత్ర చేపడుతున్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
