బలగాల ఉపసంహరణపై మాతో కలిసి రండి!

ప్రధానాంశాలు

Updated : 03/04/2021 08:32 IST

బలగాల ఉపసంహరణపై మాతో కలిసి రండి!

చైనాకు భారత్‌ సూచన

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగతా ప్రాంతాల్లోనూ వేగంగా బలగాల ఉపసంహరణకు చైనా తనతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు భారత్‌ శుక్రవారం పేర్కొంది. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడం ద్వారానే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టంచేసింది. ప్రస్తుతం రెండు దేశాలూ సైనిక, దౌత్య మార్గాల్లో ఈ అంశంపై సంప్రదింపులు సాగిస్తున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ చెప్పారు. ఈ వివాదాన్ని ఇంకా సాగదీయడం రెండు పక్షాలకూ ప్రయోజనకరం కాదని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆ ప్రాంతంలోని మిగతా వివాదాలనూ వేగంగా పరిష్కరించుకోవాలన్న అంశంపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని తెలిపారు. పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ.. గణనీయమైన ముందడుగని చెప్పారు. పశ్చిమ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మిగతా వివాదాల పరిష్కారానికి అవసరమైన పునాదిని ఇది వేసిందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన