10, 12 పరీక్షలు రద్దు చేయాలి లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలి

ప్రధానాంశాలు

Updated : 09/04/2021 13:00 IST

10, 12 పరీక్షలు రద్దు చేయాలి లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలి

విద్యార్థుల డిమాండ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున మే నెలలో జరగాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదైన పిటిషన్లపై లక్ష మందికిపైగా పది, 12 తరగతుల విద్యార్థులు సంతకం చేశారు. దీంతోపాటు ‘క్యాన్సిల్‌బోర్డ్‌ఎగ్జామ్స్‌2021’ హ్యాష్‌ట్యాగ్‌ రెండు రోజులుగా ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు, పరీక్షల సమయంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలు అన్నింటినీ కచ్చితంగా పాటిస్తామని, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ)లు పేర్కొన్నాయి. ‘‘భారత్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కేవలం కొన్ని కేసులు ఉన్నప్పుడు వారు బోర్డు పరీక్షలు రద్దుచేశారు. ఇప్పుడు కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరగా.. వారు పాఠశాలలు తెరిచేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఉన్నందున.. విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో కల్పించుకుని.. ఈ ఏడాది అన్నిరకాల పరీక్షలను రద్దుచేయాలి’’ అని పేర్కొంటూ ‘ఛేంజ్‌.ఓఆర్‌జి’లో ఓ పిటిషన్‌ నమోదైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన