కారుకు పన్ను చెల్లించాల్సిందే

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

కారుకు పన్ను చెల్లించాల్సిందే

నటుడు ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ఈనాడు డిజిటల్‌, చెన్నై: ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకుని వినియోగిస్తున్న రోల్స్‌ రాయిస్‌ కారుకు పన్ను మినహాయింపు కోరిన కోలీవుడ్‌ నటుడు ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. బకాయిపడ్డ 50% ప్రవేశ పన్ను రూ.30.30 లక్షలను 48 గంటల్లో చెల్లించాలని గురువారం ఆదేశించింది. తమ వాహనాలకు రోజుకు రూ.50 పెట్రోలు వాడే పాల వ్యాపారులు, సబ్బు కొనుగోలు చేసే పేదలు కూడా పన్ను చెల్లించే కదా వినియోగిస్తున్నారని, వీఐపీలకు ఇబ్బందేంటని ప్రశ్నించింది. ‘వృత్తిలో ఎన్ని రూ.కోట్లయినా సంపాదించుకోండి, ఎంత ఖరీదైన కారునైనా కొనుగోలు చేయండి... కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను పూర్తిగా కట్టాల్సిందేనని’ పేర్కొంది. 2015లో ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్‌రాయిస్‌ కారుకు ప్రవేశ రుసుం నిషేధించాలని నటుడు ధనుష్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సినీ నటుడు విజయ్‌కి సైతం కోర్టు నుంచి ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన