పండగల వేళ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి: కేంద్రం

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:03 IST

పండగల వేళ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి: కేంద్రం

దిల్లీ: పండగల వేళ.. కొవిడ్‌ కేసులు పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం గురువారం సూచించింది. ప్రయాణాలు, ఉత్సవాల సమయంలో కొవిడ్‌ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ కీలకమని నొక్కి చెప్పింది. వచ్చే రెండు-మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. మొత్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కేరళలోనూ తగ్గుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొనేందుకు గాను ప్రతి రాష్ట్రం, జిల్లా, మున్సిపాలిటీ సంసిద్ధంగా ఉండాలన్నారు. ఆసుపత్రులను, మానవ వనరులను, తగినంత ఆక్సిజన్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలు గుమిగూడితే ఆ వాతావరణం వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతుందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ పేర్కొన్నారు.

34 జిల్లాల్లో 10%కి పైగా పాజిటివిటీ

దేశంలో 34 జిల్లాల్లో వారపు పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని, అలాగే 32 జిల్లాల్లో 5-10 శాతం మధ్యలో ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఈ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 67.79% కేరళలోనే బయటపడ్డాయని.. లక్షకు పైగా క్రియాశీలక కేసులున్న ఏకైక రాష్ట్రం ఇదేనని చెప్పారు. మొత్తం 3,631 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని.. ఇవి పూర్తయితే 4,500 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన